ఫిబ్రవరి 7న హైదరాబాదులో జరిగే లక్షల డప్పులు వేలగుంతల కార్యక్రమానికి మాదిగలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని టీజీ ఎంఆర్పిఎస్ సూర్యపేట జిల్లా అధ్యక్షులు బచ్చల కూరి నాగరాజు పిలుపునిచ్చారు. మంగళవారం కోదాడలో జరిగిన సమావేశంలో తమ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ లక్షల డప్పుల కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారని ప్రతి మాదిగ బిడ్డ డప్పు సంకన వేసుకొని అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. తమ దారులు వేరైనా అందరి లక్ష్యం ఎస్సీ వర్గీకరణ ఒకటేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ప్రభుత్వం వెంటనే వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కలకొండ ఆదినారాయణ, సీనియర్ నాయకులు గంధం రంగయ్య, గుండెపంగు రమేష్, చీమ శ్రీను, గంధం పాండు, బల్గోరి హుస్సేన్, పంది ఏసు, కుడుముల సైదులు, కలకొండ వెంకటనారాయణ, అరి మెల్ల ప్రశాంత్, రజిని, రాజేష్ తదితరులు పాల్గొన్నారు………..