జగిత్యాల రూరల్ మండల పరిధిలోని జాబితాపూర్ గ్రామంలో మాజీ ఎంపిటిసి చిత్తరి స్వప్న శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం బిఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా గ్రామ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి అభిమాన నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ బిఆర్ఎస్ కార్యకర్తలు తాండ్ర జలంధర్, కందుల శేఖర్ గౌడ్ ,చిత్తరి సురేష్, కస్తూరి వినయ్, మారిశెట్టి రాజు, జాగిరి శ్రీను, బొమ్మ కంటి రంజిత్, ప్రసాద్, పెంట గోపి,చిత్తరి రాజిరెడ్డి, మారిశెట్టి రమేష్, అభిమాన కార్యకర్తలు పాల్గొన్నారు.