కాకినాడ మేవా ఫంక్షన్ హాలులో.. మూవ్ మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యాన “ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం”
కాకినాడ : ధర్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి బుద్దం శరణం గచ్ఛామి స్ఫూర్తిగా కుల మతాలకు అతీతంగా ప్రపంచ శాంతి కోసం మానవ సమాజం యావత్తూ అభ్యుదయ భావాలు కలిగి వుండాలని శాంతి స్థాపనతోనే ప్రపంచ సామాజిక న్యాయం సాధ్యం కాగలదని సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. ప్రపంచ సామాజిక న్యాయదినోత్సవం సందర్భంగా మూవ్ మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సంస్థ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రజలలో శాంతి మతసామరస్యత న్యాయ స్థాపన కొరకు విశేష సేవలు అందిస్తున్నప్రముఖులకు సన్మాన కార్యక్రమాన్ని జమాల్ మేవా ఫంక్షన్ హాలులో నిర్వహించారు. సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా పురస్కారాన్ని అందుకున్న రమణరాజు ధన్యవాదాలు తెలిపారు. కాకినాడ డి ఎస్ పి పాటిల్ దేవరాజ్ మనీష్ ముఖ్య అతిథిగా జవహర్ ఆలీ ఎస్ ఇజాజుద్దీన్ సయ్యద్ సాలార్ గౌరవ అతిథులుగా సంస్థ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు షేక్ హుస్సేన్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ హలీమ్ నిర్వహణ చేసారు. ప్రత్యేక అతిథులుగా ఆర్ డి ఓ ఎస్ మల్లిబాబు అడిషనల్ మున్సిపల్ కమీషనర్ టి సుధాకర్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎస్ లావణ్య కుమారి ఆర్ అండ్ బి ఇఇ టి రమేష్ కుమార్ వన్ టవున్ ఎస్ ఐ ఎం నాగ దుర్గారావు టూ టౌన్ ఎస్ ఐ ఎం అప్పల నాయుడు త్రీ టౌన్ ఎస్ ఐ కె వి సత్యనారాయణ పోర్ట్ స్టేషన్ ఎస్ ఐ పి సునీల్ కుమార్ సర్పవరం ఎస్ ఇ పెద్దిరాజు ట్రాఫిక్ ఎస్ ఐ లు ఎన్ రమేష్ డి రామారావు న్యాయవాదులు జి వి కృష్ణప్రకాష్ పి ప్రసన్న కుమార్ అల్తాఫ్ మహ్మద్ కె నాగ జ్యోతి పాల్గొన్నారు. జిల్లా ప్రతినిధులు ఎస్ కె ఇబ్రహీం మొహియుద్దీన్ అనుపమ అబ్దుల్లా అజర్ శామ్యూల్ అఖిల్ ఆలీ మదీనా భాషా గిరిజ కలీం అల్లావుద్దీన్ నూకరాజు మంగ రమీజున్నీసా సహీరాబేగం వెంకట లక్ష్మీ మన్సూర్ నగర ప్రతినిధులు షర్మిల నూర్ అబ్దుల్లా ఇబ్రహీం రామకృష్ణ ఫరూక్ బషీర సుల్తాన్ వెంకట ఉమ లీలావతి వెంకట లక్ష్మీ షాకీర్ దౌలానా బాషా అన్సార్ ఆలీ నూరుద్దీన్ స్వామి బాబు తులసి ప్రకాష్ గౌసియా బేగం సిద్ధిఖ్ అబుబకర్ నయన రాజు రమణి ఉస్మాన్ షబీర్ సిరాజుద్దీన్ జహీరుద్దీన్ పర్యవేక్షించారు.