మోతే : రైతాంగానికి మద్దతు ధరల చట్టం చేయాలని, స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలని, ఎండి పోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్ కే యం ) ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ లో ని ఇందిరా పార్కు వద్ద జరిగే ధర్నాకు వెళుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, సిపిఎం మండల కమిటీ సభ్యులు చర్లపల్లి మల్లయ్య, దోస పాటి శ్రీనివాస్, జంపాల స్వరాజ్యం ను పోలీసులు తెల్లవారుజామున అరెస్టు చేసి వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని అన్నారు. రైతాంగానికి మద్దతు ధరల చట్టం చేయాలని కోరుతూ చలో ఇందిరా పార్కు నిర్వహిస్తున్న సిపిఎం పార్టీ నాయకత్వాన్ని అరెస్టు చేయడానికి ప్రతి ఒక్కరు ఖండించాలని కోరారు. అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని అన్నారు.