Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

వక్ఫ్ అమెన్మెంట్ యాక్ట్ బిల్లు కు వ్యతిరేకిస్తూ ముస్లింల నిరసన

కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న వక్ఫ్ అమెన్మెంట్ యాక్ట్ బిల్లును ఉపసంహరించుకోవాలని మౌలానా అబ్దుల్ ఖాదీర్ రషాది,ముఫ్తీ అతార్ మౌలానా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని అన్ని మసీదుల్లో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు చేతులకు నల్ల రిబ్బన్ పట్టిలు ధరించి నిరసన వ్యక్తం చేస్తూ ప్రార్థనలు చేశారు. అనంతరం పట్టణ ప్రధాన రహదారి పై వందలాది మంది ముస్లింలు శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ముస్లింలపై కక్ష సాధింపు చర్యతో లౌకిక రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇటువంటి మతోన్మాద చర్యలు చేపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న లౌకికవాద వ్యతిరేక చర్యలు అన్నింటిని లౌకిక వాదులు ఖండించాలన్నారు. ప్రభుత్వం బిల్లు ను ఉపసంహరించుకోకపోతే యావత్ భారతదేశం ముస్లిం సోదరులంతా ఉద్యమిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు నయీమ్ భాయ్, మహిమూద్, మజాహార్, మహమ్మద్ సాబ్, మునీర్, అలీ బాయ్, అబ్బు, ఆసిఫ్, అల్తాఫ్, జాకీర్ తదితరులు పాల్గొన్నారు………

Related posts

ఉపాధ్యాయ ఎమ్మెల్సీఎన్నికల బరిలో 22 మంది  

TNR NEWS

శాంతి భద్రతల పరిరక్షణక కోసమే కార్డెన్ సెర్చ్

TNR NEWS

పట్టణ సిపిఎం పార్టీ నూతన కార్యదర్శి పల్లె వెంకటరెడ్డిని ఘనంగా సన్మానించిన సుతారి శ్రీనివాసరావు

TNR NEWS

75.భారత రాజ్యంగా దినోత్సవం

TNR NEWS

తెలంగాణలో మరోబిసి ఉద్యమానికి ప్రజలు సిద్ధం కావాలి

TNR NEWS

సీఎం రేవంత్ తో ములాఖత్ అయిన మద్దూర్ కాంగ్రెస్ నాయకులు

TNR NEWS