పేకాట ఆడితే చట్ట పరమైన చర్యలు తప్పవని కోదాడ పట్టణ సీఐ శివశంకర్ నాయక్ అన్నారు. శుక్రవారం గతంలో పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కిన నేరస్తులను బైండ్ ఓవర్ చేసి మాట్లాడారు. మరోమారు పేకాట ఆడుతూ చికితే కఠినమైన చర్యలు ఉంటాయని వారిని హెచ్చరించారు. ఎక్కడైనా పేకాట ఆడుతున్నట్లయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట పట్టణ ఎస్ఐ ఎస్కే సైదులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.