ఇటివల అనారోగ్యంతో మృతి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతకాయల వీరయ్య మృతి బాధాకరం అని కాంగ్రెస్ పార్టీ నాయకులు వేపూరి సుధీర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన అన్నారు. మృతుడి కుటుంబానికి సంతాపం సానుభూతి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చింతకాయల ఉపేందర్, పిట్టల శ్రీనివాస్, చింతకాయల కోటి, శ్రీనివాస్, చింతకాయల వెంకన్న, పాపారావు,కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

previous post