Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిది

తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిదని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు… ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనగాం ఎక్స్ రోడ్డు వద్ద మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తల్లిదండ్రులు బూర లక్ష్మయ్య గౌడ్, బూర రాజమ్మ ల జ్ఞాపకార్థం వారి విగ్రహాలను ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి, తనను చదివించారని, వారి జ్ఞాపకార్థం వారి విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. సమాజానికి సేవ చేయడం ద్వారా వారి ఆశయాలను నెరవేర్చాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు. సమాజంలో తమ పిల్లలు ఉన్నత స్థితికి ఎదగాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆకాంక్షిస్తారని, వారి కోరిక తీరే విధంగా పిల్లలు కష్టపడి చదివి జీవితంలో ఉన్న స్థాయికి చేరుకోవాలని, సమాజానికి ఉపయోగపడే విధంగా వారు ఉత్తమ పౌరులుగా ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, బిజెపి జిల్లా అధ్యక్షురాలు శ్రీలత రెడ్డి, మాజీ అధికార ప్రతినిధి బూర మల్సూరు గౌడ్, బిజెపి నాయకులు కడియం రామచంద్రయ్య,మన్మధ రెడ్డి,చల్లమల్ల నరసింహ,పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Related posts

సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ కి సన్మానం చేసి వీడ్కోలు తెలిపిన జిల్లా పోలీసు

TNR NEWS

మహిళలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త .. త్వరలో ఖాతాల్లోకి డబ్బులు!

TNR NEWS

కబడ్డీ అసోసియేషన్ కోదాడ మండల అధ్యక్షుడిగా షేక్ బాగ్దాద్..

TNR NEWS

ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం

TNR NEWS

మంత్రి పిఎ శ్రీధర్‌ రిసెప్షన్‌ కు హాజరైన మంత్రి దామోదర్‌ 

TNR NEWS

మట్టి వినాయకుణ్ణి పూజించండి… పర్యావరణాన్ని కాపాడండి – పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా

Dr Suneelkumar Yandra