కోదాడ పట్టణ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో శనివారం జంధ్యాల పూర్ణిమ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంఘ అధ్యక్షుడు గోలి నాగరాజు నివాసంలో పద్మశాలీయుల కుల దైవం మార్కండేయ మహా మునికి భావన ఋషి, బద్రావతి స్వాములకు పండితులు విశిష్ట పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా యజ్ఞోపవీత కార్యక్రమాన్ని కనుల పండువగ నిర్వహించారు. ఏడాదికి ఒకసారి వచ్చే శ్రావణ పూర్ణిమ కు ఎంతో విశిష్టత కలిగి ఉందని ఎంతో పవిత్రంగా భావించే ఈ రోజున పాత జంధ్యాలను తొలగించి నూలుతో తయారుచేసిన కొత్త జంధ్యాలను ధరించడం మూలాన స్వామి వారి ఆశీస్సులు కలుగుతాయని పలువురు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నూతన జంధ్యాలను ధరించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం పట్టణ అధ్యక్షుడు గోలి నాగరాజు, ప్రధాన కార్యదర్శి పిండిప్రోలు శ్రీనివాస్,కోశాధికారి చిట్టిపోలు గిరిప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి సంగిశెట్టి గోపాల్, నియోజకవర్గ అధ్యక్షులు కొంగర నరసింహారావు, జిల్లా ఉపాధ్యక్షుడు నక్క చంద్రం, పొన్నగంటి రామకృష్ణ, యతిరాజం, మట్టయ్య, గొర్రె రాజేష్, రాఘవయ్య, నరసింహారావు, సైదులు, శీను, సీతయ్య, రామచంద్రయ్య, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు…….

previous post