కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మహమ్మద్ నగర్ కు చెందిన కటికే కపిల్(28) అదృశ్యమైనట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. ఈనెల 18న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు తెలిసిన వారి ఇళ్లలో గాలించినా ఆచూకీ లభించకపోవడంతో అతని భార్య లావణ్య ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.