సూర్యాపేట టౌన్: సూర్యాపేట మున్సిపాలిటీ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో పట్టణంలో కొత్తగా వేసిన రోడ్లను సైతం పగలగొట్టారని ప్రభుత్వం వెంటనే కొత్త రోడ్లు వేయాలని సిపిఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్ డిమాండ్ చేశారు. సోమవారం సిపిఎం పోరుబాట లో భాగంగా పట్టణంలోని 9వ వార్డులో ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో కొత్తగా వేసిన రోడ్లన్నీ సైతం వదలకుండా ఇస్తానుసారం రోడ్లను పగలగొట్టి పైపులు వేసిన గుప్తాదారులు దానిపై కొత్త రోడ్డు వేయకుండా వెళ్లిపోయారని అన్నారు. తక్షణమే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో పగలగొట్టిన రోడ్లను పునర్నిర్మాణం చేయాలన్నారు. 9వ వార్డులో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయాలన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు పింఛన్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న పట్టించుకోవడం లేదని ప్రభుత్వం అర్హులైన వారందరికీ పింఛన్ మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు గండమల్ల భాగ్యమ్మ, శశిరేఖ, సైదమ్మ, ఎల్లమ్మ, పిట్టలరాణి, పద్మ, వెంకటమ్మ, మారయ్య పాల్గొన్నారు.