చీదేల్ల గ్రామానికి చెందిన జేరిపోతుల భవాని భర్త జానయ్య కూలి నాలి పని చేసుకుంటూ పిల్లలతో
పూరిగుడిసెలో జీవనం కొనసాగిస్తున్నారు. గత వర్షాల కారణంగా ఉన్న పూరిగుడిసె కూలిపోవడం జరిగింది.
వానలు వరదలు వస్తున్న తరుణంలో ఈ కుటుంబం అట్టి పూరిగుడిసెలో భార్య పిల్లలతో జీవనం కొనసాగించటం ఇబ్బందికరంగా మారింది. అప్పుడు ఆ కుటుంబం 2019లో కలెక్టర్ కార్యాలయంలో జనహిత లో డబల్ బెడ్ రూమ్ కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇలాంటి దీనస్థితిలో ఉన్న ఈ కుటుంబానికి గత కొన్ని సంవత్సరాల నుంచి గత ప్రభుత్వాల నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందించకపోగా? అర్హులైన ఈ కుటుంబానికి గత ప్రభుత్వాలలో ఇల్లు కూడా పొందలేక పోయారు.
ఈ ప్రజా ప్రభుత్వంలో ఇప్పటికైనా ఇలాంటి అర్హులైన నిరుపేద కుటుంబాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి నలమాద ఉత్తంకుమార్ రెడ్డి లు స్పందించి వెంటనే ప్రభుత్వం నిర్మించిన డబల్ బెడ్ రూములలో ఒక ఇల్లుని ఈ పేదవాడికి మంజూరు చేసి ఆ కుటుంబానికి అండగా నిలుస్తారని ఎదురు చూస్తుంది.