మోతే :భూమిలేని వ్యవసాయ కార్మికులందరికీ 12 వేల రూపాయలు ఇచ్చే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అర్హత పథకం అర్హులు ఉపాధి హామీ పని ఏడాదికి కనీసం 20 రోజులు పని చేయాలని నిబంధనలను వెంటనే తొలగించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు మట్టిపల్లి సైదులు డిమాండ్ చేశారు. మంగళవారం సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మోతే మండలం రాఘవాపురం గ్రామంలో జరిగిన గ్రామ సభలో తాసిల్దార్ సంఘమిత్రకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూభూమిలేని వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ జాబ్ కార్డు ద్వారా 20 రోజులు పని పోందిన కుటుంబాల ఆధార కార్డు, పట్టాదారు పాస్ బుక్ ఆధారంగా రూ.12 వేల పథకానికి ఎంపిక చేస్తామని ప్రభుత్వం నిబంధనలు పెట్టడం సమంజసం కాదన్నారు. లబ్ధిదారులను కుదించేందుకు కుట్ర జరుగుతుందన్న అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలని కోరారు. గ్రామ సభల ద్వారానే లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. జాబ్ కార్డు కలిగిన వారితోపాటు వలస కార్మికులను, కూలి పని చేసుకుని బతికే పేదలందరినీ అర్హులుగా ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు కొత్తగా జాబ్ కార్డులిచ్చి పనిదినాలు కల్పించాలని కోరిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులలో జాబ్ కార్డు పేరుతో ఆన్లైన్ పేరుతో 12 వేల రూపాయల పథకాన్ని కుదించి లబ్ధిదారులను తగ్గించాలని చూస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు కెన్నెర పోతయ్య, సిపిఎం గ్రామ కార్యదర్శి బూడిద లింగయ్య పాల్గొన్నారు.