కోదాడ పట్టణానికి చెందిన చింతలపాటి మమత నాగేంద్రంకు ఉస్మానియా యూనివర్శిటీ విశ్వవిద్యాలయం డాక్టర్ ప్రకటించింది.ఉస్మానియా యూనివర్శిటీ బిజినెస్ మేనేజిమెంట్ విభాగంలో “కోవిడ్ మహమ్మారికి ముందు తరువాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఉద్యోగుల నిలుపుదల వ్యూహాలపై తులనాత్మక అధ్యయనం” అనే పరిశోధన అంశంపై ప్రొఫెసర్ వి. శేఖర్ పర్యవేక్షణలో చింతలపాటి మమత పిహెచ్డి పూర్తి చేయడంతో ఈ డాక్టరేట్ వరించింది.మమతకు డాక్టరేట్ వరించడంతో పట్టణానికి చెందిన మమత నాగేంద్రం, తల్లిదండ్రులు శ్రీరాములు- నాగమణి వారి కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు పట్టణవాసులు సైతం అభినందించారు.