- సూర్యాపేట జిల్లాలో సదర్ సమ్మేళనం ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) పి. రాంబాబు అన్నారు. గురువారం ఐడిఓసి సమావేశ మందిరం నందు జిల్లాలోని యాదవ కులస్తుల ప్రముఖులతో నిర్వహించిన సదరన్ సమ్మేళన సన్నాక సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సదరన్ సమ్మేళనం ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించింది, జిల్లాలో సదర్ సమ్మేళనం ఉత్సవాలను నిర్వహించుటకు గాను యాదవ కులస్తుల పెద్దలతో సమావేశం ఏర్పాటు చేసి సదర్ ఉత్సవాలను ఏ విధంగా నిర్వహించాలి, ఉత్సవాలు నిర్వహించే తేదీ. స్థలము గురించి చర్చించారు. అందరు సమావేశం ఏర్పరచుకొని కుల పెద్దలు తో కమిటీ వేసుకోని తెలుపవలసిందిగా అదనపు కలెక్టర్ సంబంధిత కుల పెద్దలకు సూచించారు.ఈ కార్యక్రమంలో తేలంగాణ రైతు సంక్షేమ బోర్డు సభ్యులు చేవిటి వేంకన్న, డా,,రామ్మూర్తి, సి.హెచ్. వెంకన్న యాదవ్, లింగమంతుల దేవస్థానం మాజి చైర్మన్ కోడి సైదులు యాదవ్, పల్లెబోయిన నరసయ్య యాదవ్, యాదవ ఉద్యోగుల ఎంప్లాయిస్ ప్రెసిడెంట్ మట్టపల్లి రాము యాదవ్, వజ్జా వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
previous post