తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏం చేశారని విజయోత్సవ సభలు జరుపుకుంటున్నారు ప్రజలకు చెప్పాలని వంటేరు ప్రతాపరెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ అబద్ధపు అసత్యపు ప్రచారాలతో ప్రజలకు ఇచ్చిన అమలు కానీ 420 హామీలు ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలమైందని అన్నారు. అనేక హామీలతో ప్రజలు నమ్మించి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్యూర్ అయిందని దమ్ముంటే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుకాని 6 గ్యారంటీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అబద్దాలతో అసత్యలతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని దుయ్యబట్టారు ఫార్మా పేరుతో రైతులపై అక్రమ కేసులు పెడుతున్నందుకు విజయోత్సవాలు చేస్తున్నారని ప్రశ్నించారు, రైతులను రుణమాఫీ ఎగ్గొట్టినందుకా?, పెన్షన్లు 4000 వికలాంగులకు 6000 పెంచుతామని చెప్పి తప్పినందుకా?, ఆడబిడ్డలకు మహాలక్ష్మి ద్వారా 2500 రూపాయలు ఇస్తామని చెప్పి తప్పినందుకా? అదేవిధంగా చదువుకున్న ప్రతి ఆడబిడ్డకు స్కూటీలు ఇస్తామని చెప్పి మాట తప్పినందుకా?, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పెళ్లి చేసుకున్న ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇస్తామని చెప్పి మర్చిపోయినందుకా?, రైతులకు 500 రూపాయలు ప్రత్యే ఎకరానికి బోనస్ ఇస్తామని చెప్పి మోసం చేసినందుకా?, రైతులకు రైతు భరోసా రైతుబంధు ఎగ్గొట్టినందుకకా?, 20 ఏళ్ల కింద నిర్మించుకున్న ఇండ్లను హైదరాబాద్ పేరుతో కూల్చివేస్తున్నందుకా?, విద్యార్థులకు స్కాలర్షిప్లు 2000 కోట్ల రూపాయలు ఇవ్వనందుకా?, చదువుకున్న నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వనందుకా?, పల్లెలను ఆర్థికంగా దివాలా తీయిస్తున్నందుకా?,ఎందుకు విజయోత్సవ సభలు నిర్వహించి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని వంటేరు ప్రతాపరెడ్డి డిమాండ్ చేశారు. గత కేసిఆర్ పదేండ్ల పరిపాలన కాలంలో తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా పురోగమించింది అన్నారు. కానీ నేడు కాంగ్రెస్ వలన తెలంగాణ రాష్ట్రం తిరోగమనడం బాట పట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రం లోని పల్లెలు సబ్బండ వర్గాలు ఆర్థికంగా బలోపేతం అయ్యాయని ఏ ఊరికి వెళ్ళిన కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమం కనపడుతుందన్నారు. కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడా కెసిఆర్ ఒక మహా వృక్షమని ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో ప్రతి ఇంటిలో కెసిఆర్ ఆనవాళ్లు కనిపిస్తున్నాయి అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అబద్ధం రాజ్యమేలుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత రేవంత్ రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి శూన్యం అని అన్నారు. ఇప్పటికైన ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.