Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

శానిటైజర్ తాగి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

 

అస్సాం రాష్ట్రానికి చెందిన విద్యార్థిని ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సంఘటన కోదాడ పట్టణంలోని స్నేహ నర్సింగ్ కళాశాలలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.బాధితులు,స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..అస్సాం రాష్ట్రానికి చెందిన నర్గెస్ పర్బిన్ అనే యువతి స్నేహ నర్సింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం హాస్టల్లో ఉండి చదువుతుంది.కాగా కళాశాల యాజమాన్యం ఫీజు చెల్లించాలని ఇబ్బందులు గురి చేసారని ఆ వేధింపులు తట్టుకోలేక హ్యాండ్ శానిటైజర్ తాగి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.కళాశాల యాజమాన్యానికి ఏదైనా విద్యార్థుల సమస్యలు ఉండి ఎదురు మాట్లాడితే ఇష్టం వచ్చినట్లు దూషిస్తున్నారని తెలిపారు.అసలే అమ్మాయిలం సరైన సౌకర్యాలు కళాశాలలో,హాస్టల్ లో లేక నానా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.కాగా కళాశాలలో విద్యార్థిని శానిటైజర్ బుధవారం రాత్రి తాగడంతో హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి వార్డెన్ తీసుకొని వచ్చారు.అప్పటి నుండి ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది.కానీ యాజమాన్యం మాత్రం పత్తా లేకుండా పోవడంతో బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.దీనిపై టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు రాగా టౌన్ ఎస్ఐ రంజిత్ రెడ్డి కళాశాలను సందర్శించి విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలను సహ విద్యార్థులను అడిగి తెలుసుకొని బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని తెలిపారు.దీనిపై కళాశాల యాజమాన్యాన్ని వివరణ అడగగా కళాశాల ఫీజు అడిగడం వలన ఈ విధంగా చేసుకుంది అని తెలిపారు.

Related posts

బీజేపీ పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలు

TNR NEWS

విద్యార్థుల మధ్యాహ్న భోజనం తనిఖీ 

TNR NEWS

గంధం సైదులు ఆధ్వర్యంలో రెండు రోజులు ఘనంగా ముగ్గుల పోటీలు

Harish Hs

ముగిసిన రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు

Harish Hs

వ్యవసాయ మార్కెట్ కు సెలవులు

Harish Hs

పబ్లిక్ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం.

Harish Hs