మహబూబాబాద్ జిల్లా, తొర్రూర్ మండలం ఫతేపురం గ్రామ పంచాయతీ కార్మికుని కుటుంబానికి అమ్మాపురం గ్రామస్తులు 50 కెజీ ల బియ్యం అందచేయడం జరిగింది. కాగా గ్రామ పంచాయతీ కార్మికుని భార్య డొనక లక్ష్మి ఇటీవల అనారోగ్య కారణంతో మరణించడం జరిగింది. గ్రామానికి నిత్య సేవ చేసే కార్మికున్ని ఆదుకోవడం మన కర్తవ్యమని గ్రామస్తులు బియ్యం సహాయం చేశామని ఈ సందర్బంగా చెప్పడం జరిగింది.అనంతరం అమ్మాపురం గ్రామ ప్రజలు డొనక లక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించి, దైర్యం చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమం లో మార్క శ్రీనివాస్, ముద్దం మహబూబ్ రెడ్డి,మాచర్ల అనిల్,సమ్మయ్య, ఉప్పలయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.