Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ఘనంగా హిందూ ముస్లిం ఐక్యత దినోత్సవం…..

 

హిందూ ముస్లిం ఐక్యత దినోత్సవాన్ని కోదాడ పట్టణంలోని రాజీవ్ చౌక్ చౌరస్తాలో సోషల్ యాక్టివిస్ట్ ఫోరం కన్వీనర్ షేక్ మునీర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 1927 డిసెంబర్ 19న ఆంగ్లేయులు ఉరి తీసిన భారత స్వాతంత్ర్య సమరయోధులు అమరవీరులు పండిత రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫాఖుల్లాఖాన్ చిత్రపటాలకు పూలమాలలు వేసి కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటిష్ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టి మాతృభూమిని బ్రిటిష్ వారి కబంధహస్తాల నుండి విముక్తి చేయాలన్న సంకల్పం ఆ ఇరువురి బాటాలను ఏకం చేసిందన్నారు. మత ధర్మాలు వేరువేరు అయినప్పటికీ స్వాతంత్ర సాధనలో వారి స్నేహబంధం ఆనాటికి ఈనాటికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్, ఏపూరి రాజు, భాజన్, రాయపూడి వెంకటనారాయణ, శోభన్, ఖాజామీయా, షఫీ, రఫీ, శ్రీకాంత్, జహీర్ తదితరులు పాల్గొన్నారు………

Related posts

వెయ్యి గొంతులు లక్ష డప్పుల ప్రచార రథయాత్ర. ఈనెల 11న బషీరాబాద్ మండల కేంద్రంలో ప్రారంభమై రథయాత్ర.  ఆదివారం నవాబ్ పెట్ మండలం మీదుగా  వికారాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది.  మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా అధ్యక్షులు పి ఆనంద్ మాదిగ

TNR NEWS

బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం……..

Harish Hs

కొండా అనసూర్యమ్మ మృతి బాధాకరం

TNR NEWS

నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి చివరి వరకు జీవించిన బచ్చలకూరి జార్జి

TNR NEWS

BRS పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లికి విగ్రహానికి పాలాభిషేకం

TNR NEWS

వేడుకల పేరిట డబ్బును వృధా చేయవద్దు

Harish Hs