Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కొత్త మెనూ ఖచ్చితంగా పాటించాలి బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం ప్రభుత్వం నూతనంగా అమల్లోకి తీసుకొచ్చిన కొత్తమెనూను వసతిగృహాల్లో ఖచ్చితంగా పాటించాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆదేశించారు. ఆదివారం పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతిగృహాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెండురోజుల కిందట ఉడకని భోజనం చేయడంతో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె హాస్టల్ ను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. హాస్టల్లో మూత్రశాలలు, తాగునీటి సరఫరా తీరును ఆమె పరిశీలించారు. మూత్రశాలల సమస్యను పరిష్కరించాలంటూ విద్యార్థులు ఈ సందర్భంగా కోరారు. విద్యార్థులతో కలిసి కాసేపు సరదాగా గడిపారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు.

Related posts

గ్యార్మి ఉత్సవాల్లో పాల్గొన్న మున్సిపల్ కౌన్సిలర్ చంద్రారెడ్డి 

TNR NEWS

ఓటు భవితకు బాట

Harish Hs

విమాన ప్రమాద ఘటన పట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎర్నేని వెంకటరత్నం బాబు

Harish Hs

కార్తీక పౌర్ణమి మాసన గంగమ్మ ఆలయం లో ఘంగా పూజలు

TNR NEWS

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

TNR NEWS

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి – సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలి – ఎవరో చెప్పే మాయ మాటలు విని మోసపోవద్దు – సీనియర్ జూనియర్ అని చూడకుండా స్నేహభావంతో కలిసిమెలిసి ఉండాలి – గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి

TNR NEWS