రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పిఎ శ్రీధర్, నాగలక్ష్మిల రిసెప్షన్ కు మంత్రి దామోదర్ రాజనర్సింహ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆదివారం ఏడుపాలయల దేవస్థానం వద్ద జరిగిన రిసెప్షన్‌కు హాజరై, నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈనెల 26న వీరి వివాహం జహీరాబాద్ దగ్గరలోని పస్తాపూర్ కన్వెన్షన్‌లో జరిగింది. మంత్రి సీడబ్ల్యూసీ సమావేశాలకు వెళ్లడంతో హజరుకాలేకపోయారని పార్టీ వర్గాలు తెలిపాయి. నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మెదక్ జిల్లా కాంగ్రేస్ పార్టీ అధ్యక్షుడు అంజనేయులు గౌడ్, నర్సాపూర్ కాంగ్రేస్ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి, నియోజకవర్గం పరిధిలోని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.