సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు ఎస్.కె దస్తగిరి అన్నారు. బుధవారం మునగాల మండల కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో ఆ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. అనేక నిర్మాణాలు గావిస్తున్న నిర్మాణరంగ కార్మికులకు సొంత గూడు లేక అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మండలంలో ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో భవన నిర్మాణ కార్మికులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే 60 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికునికి 6000 పెన్షన్ సదుపాయం కల్పించాలని గత ప్రభుత్వం ఇచ్చిన మోటార్ సైకిల్ హామీని ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయాలని, వెల్ఫేర్ బోర్డులో ఉన్న పెండింగ్ క్లెయిమ్ లను తక్షణమే పరిష్కరించాలని, దళార్లు విచ్చలవిడిగా ఇప్పిస్తున్న వెల్ఫేర్ బోర్డు బోగస్ కార్డులను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల కార్యదర్శి నాగేంద్రబాబు టౌన్ అధ్యక్షుడు అల్లి నాగరాజు సహాయ కార్యదర్శి కోల ఆంజనేయులు సురభి రమేష్ ఎస్ కే జానీ పాషా కనకయ్య నరేష్ పుల్లారావు తదితరులు పాల్గొన్న.