తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి లను శుక్రవారం కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం ఇంచార్జ్ పామేన భీం భరత్ నగరంలోని వారి వారి నివాసంలలో వేరు వేరుగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మొహినాబాద్ మండలంలోని కనకమామిడి గ్రామంలో అత్యంత వైభవంగా నిర్వహించే శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈనెల 8 నుంచి 10 వరకు మహోత్సవానికి రావాలని వారికి ఆహ్వాన పత్రికలు అందించారు. ఆయన వెంట రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరి సతీష్, మొయినాబాద్ మండల అధ్యక్షులు మాణెయ్య, వైస్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, బాకారం వెంకట్ రెడ్డి, వెంకటాపురం మహేందర్ రెడ్డి, నవాబ్ పేట మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల్ యాదవ్, కార్యదర్శి ఉపేందర్ రెడ్డి, చేవెళ్ల కాంగ్రెస్ నాయకులు జుక్కన్నగారి శ్రీకాంత్ రెడ్డి, యువజన కాంగ్రెస్ చేవెళ్ల మాజీ మండల అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ నాయకులు సుశాంత్ తదితరులు ఉన్నారు.