మండలం లో నేడు సావిత్రి బాయ్ ఫూలే 194వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. .అనంతరం వారు మాట్లాడుతూ, సావిత్రి హాయ్ ఫూలే భారతదేశ మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయులుగా సేవలందించి, ప్రజలకు ఎంతో మేలు చేసిందని, అట్లాగే ఆమె సేవలు ఎనలేనివని, మర్చిపోలేని గుర్తింపులంటూ, ఇలాంటి జయంతి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రధాన ఉపధ్యాయులు, రాజన్న, రాజారాం, వెంకటేష్, శంకర్, పాఠశాల సిబ్బంది, నస్పూరి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.