ప్రజా పాలన ఏడాది పూర్తి చేసు కుంటున్న సందర్భంగా ప్రభుత్వ విజయాలు ప్రజలకు వివరించేందుకు ప్రజాపాలన విజయోత్సవ కళా యాత్రను ప్రారంభించినట్లు నెల్లూట్ల సుమన్ తెలిపారు.
చెన్నారావుపేట, ఖాదర్పేట్ గ్రామాలలో,సమాచార పౌర సంబంధాల శాఖ, సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీ నుండి డిసెంబర్ 7వ తేదీ వరకు నిర్వహించనున్న
ప్రజపాలన కళాయాత్ర నేడు చెన్నారావుపేట మండల కేంద్రంకు చేరుకోవడం జరిగింది.
అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ సాంస్కృతిక సారథి నర్సంపేట టీం లీడర్ నెల్లుట్ల సుమన్ పాల్గొని మాట్లాడుతూ…
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై గ్రామ, మున్సిపల్ వార్డుల్లో విస్తృతంగా టీఎస్సెస్ కళాకారులు తమ ఆటా ….పాటలు, నాటికలు ద్వారా అవగాహన కల్పించడం ఈ కళా యాత్ర ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ప్రతి రోజు మూడు గ్రామాల్లో ఆటపాటలు, నాటిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని అన్నారు.
ప్రజలను ఆకర్షించేలా ప్రదర్శనల ప్రణాళిక రూపొందించుకున్నామని ప్రణాళికల ప్రకారం కళాయాత్ర నడుస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ మీద వంట గ్యాస్ ను, అందించడం జరుగుతుందని,మహిళలు ఆర్టీసీ బస్సులలో ఆధార్ కార్డు చూయించి ఉచితంగా ప్రయాణం చేసేటటువంటి వసతి కల్పించిందని,రైతన్నలకు ముఖ్యంగా రెండు లక్షల రుణమాఫీ చేసి రంది పడే రైతుల కళ్ళల్లో ఆనందాలు నింపిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు అండదండగా నిలిచిందని అన్నారు. ఐ కె పీ సెంటర్ ల ద్వారా వడ్లు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి సన్న వడ్లకు అదనంగా 500లు బోనసిస్తూ గిట్టుబాటు ధరకే ప్రభుత్వం వడ్ల ను కొంటుందని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, నిరుద్యోగులకు 50 వేల ఉద్యోగాలు భర్తీ చేసి, నిరుద్యోగులు బతుకుల్లో చిరువెలుగులు నింపింది అని అన్నారు. కావున ప్రజలంతా కూడా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటుటువంటి సంక్షేమ పథకాలను అర్హులైన వాళ్ళు లబ్ది పొంది ప్రయోజకులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారధి నర్సంపేట టీం లీడర్ నెల్లుట్ల సుమన్ కళాకారులు యోచన, తాళ్ల సునీల్, పడిదం రాజేందర్, గాదెపాక బాబు , బరిగల రవీందర్, తాళ్ల పెళ్లి అశోక్ మరియు మహిళా సంఘాలు, గ్రామ ప్రజలు పాల్గోన్నారు.