Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

వీరాపూర్ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు మంజూరి పత్రాల పంపిణీ 

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని వీరాపూర్ గ్రామంలో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా లకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు మంజూరి పత్రాలను మండల అధికారులు అందజేయడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారులుగా 97 మందిని, కొత్త రేషన్ కార్డులు 11 మందికి,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 26 మందికి, రైతు భరోసా 201 మందిని ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి మండల ప్రత్యేక అధికారి మధుసూదన్, నోడల్ ఆఫీసర్, ఎంపీడీవో ఏ. ఆంజనేయులు, తాసిల్దార్ ఉట్కూరి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీఓ పాక మంజుల, ఏపీవో రాజబాబు వివిధ శాఖల అధికారులు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

 

తాము అర్హులమే …. మాకు రాలేదు

 

 

తాము గత సంవత్సరం ఉపాధి హామీ పనులలో ఎన్నో రోజులు పనిచేశామని తమకు భూమిలేదని అయినా తమకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో పేరు రాలేదని కొందరు మహిళలు ఆవేదన వ్యక్తపరిచారు. ఇందిరమ్మ ఇండ్లలో సైతం ఒకే ఇంటికి ఇద్దరినీ లబ్ధిదారులను, ఎంపిక చేశారని అర్హులైన తమకు రాలేదని మరికొందరు మహిళలు వాపోయారు.

 

తనకు సంతోషం కలిగింది

 

తాను కొన్ని సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డు కొరకు ఇంటి నిర్మాణం కొరకు ఎదురు చూశానని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తన కొత్త రేషన్ కార్డు ఇందిరమ్మ ఇల్లు రావడం సంతోషం కలిగించిందని వీరాపూర్ గ్రామానికి చెందిన శేఖర్ తెలిపాడు.

Related posts

ఆర్టీసీ లోపనిభారాలు తగ్గించాలి. వేధింపులు అపాలి. సిఐటీయూ

TNR NEWS

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Harish Hs

చట్టాలపై అవగాహనతో ఉజ్వల భవిష్యత్తు

Harish Hs

అమ్మాపురంలో రైతు దినోత్సవం  రైతు దినోత్సవం రోజు రైతులకు సన్మానం 

TNR NEWS

అభయాంజనేయ స్వామి దేవాలయంలో అన్నదానం

Harish Hs

ఓదెల మల్లిఖార్జున స్వామి దేవస్థానం ఆవరణలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు  పుట్టినరోజు వేడుకలు

TNR NEWS