Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

దేశ భవిష్యత్తు యువత నడవడిక పై ఆధారపడి ఉంది

సామాజిక అంశాలు,రోడ్డు భద్రత మాదకద్రవ్యాల నిర్మూలన పై అనంతగిరి పరిధిలోని అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాల నందు జరిగిన అవగాహన కార్యక్రమంలో కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, కోదాడ రూరల్ సీఐ రజిత రెడ్డి, స్థానిక ఎస్సై నవీన్ కుమార్, ఎం వి ఐ జిలాని,పోలీస్ అధికారులు కళాశాల యాజమాన్యం పాల్గొన్నారు. పోలీసు కళా బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పోలీసు కళా బృందం సభ్యులు సామాజిక అంశాలు రోడ్డు ప్రమాదాలు మాదకద్రవ్యాల నిర్మూలన యువత ఆదర్శాలు యువత లక్ష్యాలు పలు అంశాలపై ఆటపాటలతో విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలు చెడు అలవాట్లకు లోనై వారి బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారు, తద్వారా దేశం యువశక్తిని కోల్పోతుంది. ఇలాంటి పరిణామాలు అభివృద్ధిని సామాజిక భద్రతను దెబ్బతీస్తాయి. కావున ప్రతి ఒక్క విద్యార్థి యువత సామాజిక భద్రతపై అవగాహన కలిగి ఉండాలని సమాజంలో మంచి చెడుల పట్ల స్పృహ ఉండాలని ప్రమాదాలను గుర్తించాలని కోరారు. ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించడం వల్ల వారి కుటుంబం వీధిపాలవుతుందని రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలని మరీ ముఖ్యంగా యువత అజాగ్రత్తగా వాహనాలు నడపొద్దని కోరారు. మాదకద్రవ్యాలను నిర్మూలించడంలో యువత ప్రాథమిక భూమిక పోషించాలని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రుల కష్టాలను తెలుసుకోవాలని, విద్యార్థిని విద్యార్థులు అందరూ నైతిక విలువలను పెంపొందించుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమం నందు అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ వైస్ చైర్మన్ జయపాల్ రెడ్డి,ఏవో పాండురంగ ప్రసాద్, మరియు భూపతి రావు, ఇన్చార్జి ప్రిన్సిపల్ ఎం.వి శివప్రసాద్, జాతీయ సేవా సంస్థ కోఆర్డినేటర్ వెంకటేశ్వరరావు,

పోలీస్ కళాబృందం ఇన్చార్జ్ యల్లయ్య , గోపయ్య, కృష్ణ, నాగార్జున, ఈశ్వర చారి, గురులింగం, పోలీస్ సిబ్బంది కానిస్టేబుల్ జానీ పాషా, రవీందర్ నాయక్, సాయి కృష్ణ, మరియు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

మే డే స్ఫూర్తితో పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు 

TNR NEWS

చెరువు కట్టపై కంపచెట్లను తొలగిస్తాం

Harish Hs

శానిటైజర్ తాగి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

TNR NEWS

రేషన్ డీలర్ల నూతన సంవత్సర క్యాలండర్ ఆవిష్కరణ 

TNR NEWS

ప్రభుత్వ హాస్పిటల్ లో మెరుగైన ప్రసూతి సేవలు అందించాలి…సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యత ఇవ్వాలి…. విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి….. మెను ప్రకారం విద్యార్థులకి భోజన సౌకర్యం కల్పించాలి…. జిల్లా కలెక్టర్  తేజస్ నంద్ లాల్ పవార్ 

TNR NEWS

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ

Harish Hs