మునగాల మండల పరిధిలోని రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా కుష్టు వ్యాధి నిర్మూలన కోసం వైద్య సిబ్బంది మరియు ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ…కుష్టి వ్యాధి లిప్రే బ్యాసిలష్ బ్యాక్టీరియా వలన వస్తుందని ఈ యొక్క వ్యాధి లక్షణాలు స్పర్శ లేని మచ్చలు చర్మం పైన ఎర్రని గోధుమ రంగు ముద్దు బారిన మచ్చలు ఉంటే కుష్టి వ్యాధిగా గుర్తించి వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించాలని వారన్నారు కుష్టి వ్యాధి ఒక సామాన్యమైన వ్యాధి కుష్టి వ్యాధి వంశపారపర్యం కాదు ఎవరికైనా రావచ్చు ఈ వ్యాధి అంటే ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదన్నారు కుష్టి వ్యాధిని తొలి దశలో గుర్తించి మందులు వాడితే పూర్తిగా నయం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి బి భాస్కరరాజు సూపర్వైజర్ జయమ్మ సిబ్బంది పాల్గొన్నారు.
previous post