కోదాడ పట్టణం లోనీ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ నందు హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న అబ్దుల్ ఖయ్యాం ఏ ఎస్ఐ గా పదోన్నతి పొందిన సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ తోటి సిబ్బంది కలిసి బుధవారం అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా కోదాడ ముస్లిం మైనార్టీ నాయకులు అబ్దుల్ ఖయ్యాం ను ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షేక్ మౌలాలి, షేక్ అజహర్ బాబా, షేక్ పాసి, మొహమ్మద్ ఇమ్రాన్, అతర్ బాబా, మహమ్మద్ సక్సేనా, చిత్తలూరి అన్వేష్, మీగడ రామరాజు, తదితరులు పాల్గొన్నారు.