సూర్యాపేట జిల్లాలోని శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర అట్టహాసంగా ప్రారంభమై లింగన్న గట్టుపై దేవర పెట్టే చేరుకోవడంతో దురాజ్ పల్లి జాతర జన సముద్రం అయింది. ఓ లింగా.. ఓ లింగా నామ స్మరణం తో గొల్ల గట్టు మారుమోగింది. సోమవారం గాంధీనగర్ ముద్దుబిడ్డ బీసీ నాయకుడు వట్టే జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో భక్త జనం బేరీలతో ర్యాలీ నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ముఖ్య అతిథులుగా బీసీ నాయకులు ఆంధ్ర బొబ్బిలి బోడె రామచందర్ యాదవ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, చిన్న శ్రీశైలం లకు బీసీల యువజన సంఘాల మహిళలు హారతులు ఇచ్చి యాదవుల సంప్రదాయ నాట్యాలతో స్వాగతం పలికారు. అనంతరం లింగమంతుల స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
*రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జాతర..*
తెలంగాణలో సమ్మక్క సారలమ్మ జాతర తరువాత రెండో అతిపెద్ద జాతరగా సూర్యాపేట జిల్లా శ్రీ లింగమంతుల స్వామి(గొల్ల గట్టు) జాతర. కేసారం గ్రామం నుండి దేవర పెట్టే గుట్టపై చేరటంతో స్వామి వారి దర్శనం కొరకు భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. గొల్ల గట్టు జాతర ఈనెల 16 నుండి ప్రారంభమై 20వ తేదీ వరకు ఐదు రోజులపాటు కొనసాగనుంది.