పిఠాపురం : ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న పిఠాపురం పట్టణంలో వేంచేసిన శ్రీరాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వరస్వామి ఆలయంలో జరిగే నిత్యన్నదానానికి కాకినాడకు చెందిన కలిదిండి భాస్కరనారాయణ రాజు దంపతులు మంగళవారం విరాళం అందజేశారు. శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానం నిత్యన్నదానం ట్రస్ట్‌కు ఒక లక్ష వేయ్యి నూట పదహార్లు రూపాయలు రూ.1,01,116లు శాశ్వత అన్నదాన పథకమునకు విరాళం ఇచ్చారు. ప్రతి సంవత్సరం మార్చి 3వ తేదీన అన్నదానం జరిపించవలసిందిగా వారు ఆలయ అధికారులను కోరారు. వారికి దేవస్థాన సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ అన్నదాన పథకం బాండ్ అందజేసి, శ్రీ స్వామివారి చిత్రపటం, శేషవస్త్రాలు మరియు ప్రసాదాలను అందజేశారు.
