మోతే : పెండింగ్ లో ఉన్న భవన నిర్మాణ కార్మికుల క్లైమ్లను వెంటనే పరిష్కరించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు ఒగ్గు సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మోతే మండల కేంద్రంలో జరిగిన భవన నిర్మాణ కార్మిక సంఘం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా భవన నిర్మాణ కార్మికుల క్లెయిమ్ లు పెండింగ్ లో ఉండటం మూలంగా కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెల్ఫేర్ బోర్డు నిధులు దారి మళ్లించి ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకొని ప్రభుత్వ వెల్ఫేర్ బోర్డు ద్వారానే నేరుగా సంక్షేమ పథకాలు కార్మికులకు అందించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట భవన నిర్మాణ కార్మిక సంఘం మండలం ఉపాధ్యక్షులు గట్టు శ్రీను, నాయకులు షేక్ సైదులు తదితరులు పాల్గొన్నారు.