సూర్యాపేట జిల్లాలోనే అతి పురాతనమైన దేవాలయంగా పేరుగాంచిన మునగాల మండల పరిధిలోని రేపాల స్వయంభు లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుండి ఈ నెల 18 తారీకు వరకు పది రోజులపాటు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయని దేవాలయ కమిటీ చైర్మన్ సారిక రామయ్య తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈనెల 13 వ తారీఖున రాత్రి స్వామివారి కల్యాణ మహోత్సవం, ఈనెల 17 వ తారీకు ఉదయం 10 గంటలకు గాంధోళి (వసంతోత్సవం) అత్యంత వైభవంగా నిర్వహించబడతాయని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని అన్నారు. పది రోజులపాటు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయని, ప్రతిరోజు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహిస్తారని తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలియజేశారు.