- కేంద్రం పద్మవిభూషణ్ పురస్కారాన్ని అంకితమివ్వాలి
కాకినాడ : అన్నమయ్య ఆత్మగా నిలిచిన తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ స్వర్గస్తులవ్వడం శ్రీవారి పరమపదానికి చేరిన అంతిమయజ్ఞంగా భోగి గణపతి పీఠం పేర్కొంది. తిరుమల కొండపై ఏ మూల వున్నా… ఏ చోట ఉన్నా… గాలి అలలపై తేలివచ్చే అన్నమయ్య కీర్తనల గరిమెళ్ళ గళం శ్రీవారి భక్తుల చెవికి సోకగానే మధురానంద భరితులవ్వడం శ్రీవారి వరంగా లభించిన ప్రత్యేకతగా పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రపంచ వ్యాపితంగా పర్యటించి అన్నమయ్య నాద యజ్ఞాలు నిర్వహించిన గరిమెళ్ళ జీవితం సంగీత సాహిత్య ఆధ్యాత్మిక జ్యోతిగా వెలుగొందిన దృష్ట్యా భారత ప్రభుత్వం ముందడుగు వేసి గరిమెళ్ళకు పద్మవిభూషణ్ పురస్కారం అంకితం చేయాలని కోరారు.