కోదాడ పట్టణంలో ఆగస్టు మూడో తేదీ ఆదివారం సాంప్రదాయపరంగా జరగనున్న ముత్యాలమ్మ పండుగకు మాజీ సర్పంచ్ ఆధ్వర్యంలో ముమ్మరంగా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. అమ్మవారికి పూజలు చేసేందుకు ఎడ్లబండ్లను ముస్తాబు చేసి సిద్ధం చేస్తున్నారు ముత్యాలమ్మ పండుగకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని ఎమ్మెల్యే పద్మావతినీ ఎర్నేని శుక్రవారం కోదాడ పట్టణంలో ఆహ్వానించారు ముత్యాలమ్మ పండుగ తెలంగాణ ప్రజల సంస్కృతిలో భాగమన్నారు గ్రామ ప్రజలు మహమ్మారుల నుండి సుభిక్షంగా ఉండేందుకు పాడి పంటలు కలిగి ప్రజలు సుఖసంతోషాలతో ఉండేందుకు అనాదిగా నిర్వహిస్తున్న ముత్యాలమ్మ పండుగలో కోదాడ పట్టణ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు ముందస్తుగా పట్టణ ప్రజలకు ముత్యాలమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
