అన్ని దానాల కన్నా గొప్పదనం రక్తదానం,రక్తదానం చేయండి మరి ఒకరికి ప్రాణదాతలుగా నిలబడండి అని మండల విద్యాధికారి ఎండి సలీం షరీఫ్ అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోనే ప్రతిభ బ్లూమ్ ఇన్నోవేటివ్ పాఠశాల ఆధ్వర్యంలో మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాధికారి ఎండి సలీం షరీఫ్ సరాయ్ మీర్ అలాం ఇమామ్ మహమ్మద్ ముక్తి అతహార్ మౌలానాలు పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుండి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్న స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం ప్రతి ఒక్కరు బాధ్యత అని అన్నారు. ఈ క్యాంపులో 55 బ్లడ్ బ్యాగులను సేకరించారని తెలిపారు. అనంతరం స్కూలు యాజమాన్యం ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు. పిలవగానే క్యాంపుకు వచ్చిన సూర్యాపేట ఏరియా హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ వారికి, రక్త దాతలకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ ఎండి షేర్ అలీ, జహీర్, సిరాజ్, అయూబ్ మౌలానా, ముజాహిద్, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, రక్తదాతలు తదితరులు పాల్గొన్నారు.