సూర్యాపేట టౌన్: రోజురోజుకు దిన, దిన అభివృద్ధి చెందుతున్న సూర్యాపేట పట్టణంలో పార్థివ రధాలు మూడే ఉండటంవల్ల పట్టణ ప్రజలు ఇబ్బందులకు గురైతున్నారని వాటి సంఖ్యను ఆరుకు పెంచాలని సిపిఎం పార్టీ వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్ డిమాండ్ చేశారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని సీతారాంపురం లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సూర్యాపేట మున్సిపాలిటీలో రెండు లక్షలకు పైగా ప్రజలు నివాసం ఉంటున్నారని రోజు అనేక మంది వివిధ కారణాల మూలంగా చనిపోతున్నారని వారికి అనుగుణంగా పార్థివ వాహనాలు లేకపోవడం పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సూర్యాపేట పట్టణంలో హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులకు మతాలవారీగా ఒక్కొక్కటి చొప్పున పార్థివ రథాలను పురపాలక సంఘం వారు కేటాయించారని అవి రెండు లక్షల పైగా ఉన్న సూర్యాపేట పట్టణ ప్రజలకు అసౌకర్యంగా ఉన్నాయని వాటి సంఖ్యను ఆరుకు పెంచాలని కోరారు. ఒకే మతం వారు ఇద్దరు ముగ్గురు ఒకేరోజు చనిపోయిన సందర్భంగా సమస్య తీవ్రంగా ఉంటుందన్నారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వం ప్రజలకు సౌకర్యం మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు షేక్ జహంగీర్, టేకుల సుధాకర్ పాల్గొన్నారు.