Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

29న జరిగేబహిరంగ సభను జయప్రదం చేయండి. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పెళ్లి సైదులు

 

మోతే: సిపిఎం పార్టీ సూర్యాపేట జిల్లా తృతీయ మహాసభల సందర్భంగా నవంబర్ 29న గాంధీ పార్కులో జరిగే బహిరంగ సభకు వేలాదిగా తరలిరావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు పిలుపునిచ్చారు. శుక్రవారం మోతే మండల కేంద్రంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగే సిపిఎం జిల్లా మహాసభల కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించి ఆయన మాట్లాడుతూ నవంబర్ 29న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ లో వేలాది మందితో బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఈ బహిరంగ సభకు మోతే మండలం నుండి వందలాది మందిని సమీకరణ చేస్తున్నట్లు చెప్పారు. 12 సంవత్సరాల తరువాత సూర్యాపేట పట్టణంలో సిపిఎం పార్టీ జిల్లా మహాసభలు జరుపుకోవడం సంతోషదాయకం అన్నారు. నవంబర్ 29న గాంధీ పార్క్ లో జరిగే బహిరంగ సభకు సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్, బీవీ రాఘవులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శితమ్మినేని వీరభద్రం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మిలు హాజరవుతున్నారని అన్నారు.నవంబర్30, డిసెంబర్ 1 తేదీల లో 500 మంది ప్రతినిధులతో సుమంగళి ఫంక్షన్ హాల్ లో మహాసభలు జరుగుతాయని చెప్పారు. ఈ మహాసభల విజయవంతానికై ప్రజలంతా హార్దికంగా,ఆర్థికంగా సహాయ సహకారాలుఅందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ములుకూరి గోపాల్ రెడ్డి, మండల కమిటీ సభ్యులు కక్కిరేణి సత్యనారాయణ, గుంట గాని ఏసు, కిన్నెర పోతయ్య, నాగం మల్లయ్య,బానోతు లచ్చిరాం, చర్లపల్లి మల్లయ్య, జంపాల స్వరాజ్యం, దోసపాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

రణభేరి సభకు తరలి వెళ్లిన ఆర్యవైశ్యులు

Harish Hs

నేడు కోదాడలో మంత్రి పర్యటన

Harish Hs

తొర్రూర్ అయ్యప్ప స్వాముల అన్నదాన ప్రభు కార్యక్రమంలో పాల్గొన్న పాలకుర్తి ఎమ్మెల్యే 

TNR NEWS

పాఠశాల వార్డెన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన వరంగల్ జిల్లా కలెక్టర్

TNR NEWS

75.భారత రాజ్యంగా దినోత్సవం

TNR NEWS

పంది తిరపయ్యకు పితృవియోగం

Harish Hs