కార్తిక పౌర్ణమి సందర్బంగా సూర్యపేట జిల్లాలోని జాజిరెడ్డిగూడెం (మం) అర్వపల్లిలోని శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేకంగా జరుగుతున్న స్వామివారి కళ్యాణ వేడుకలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి- సునీత దంపతులు, తుంగతూర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ – కమల దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఇరువురు దంపతులకు ఆశీర్వచనం చేశారు. ఈ వేడుకల్లో భక్తులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.