Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

జోగిపేటలో విద్యాసంస్థల బంద్‌ గురుకుల పాఠశాలల్లో ఫుడ్‌ పాయిజన్‌ అయినా పట్టించుకోరా?  ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎర్రోళ్ల మహేష్‌ డిమాండ్‌ 

జోగిపేట: భారత విద్యార్థి ఫెడరేషన్‌( ఎస్‌ఎఫ్‌ఐ) తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం జోగిపేటలో విద్యాసంస్థల బంద్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఎర్రోళ్ల మహేష్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నెలరోజులు నుంచి రోజుకొక హాస్టల్, గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్‌ పాయిజన్‌ అయి విద్యార్థులు హాస్పిటల్‌ పాలవుతున్నారని అన్నారు. రాష ్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఫుడ్‌ పాయిజన్‌ అవుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని ఆయన అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లును విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ కోరారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి దత్తు రెడ్డి ,జిల్లా కమిటీ సభ్యులు రాజకుమార్,ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ,కృష్ణ, రవి, సాయి, నవీన్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Related posts

మహిళా దినోత్సవం సందర్భంగా రూరల్ సీఐ రజిత రెడ్డికి అభినందనలు

Harish Hs

ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి పనిచేయాలి. వికారాబాద్ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి. దిశ చైర్మన్, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి.

TNR NEWS

పల్లె చుక్కయ్యను పరామర్శించిన మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి… 5000 రూపాయల ఆర్థిక సహాయం అందజేత

TNR NEWS

తెలంగాణ సాయుధ పోరాట వీరనారి మల్లు స్వరాజ్యం

TNR NEWS

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

TNR NEWS

కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో అబుల్ కలాం జయంతి………  మౌలానా అబుల్ కలాం జీవితం ఆదర్శం……..  రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ఎం ఏ జబ్బార్……….

TNR NEWS