Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

ఎమ్మెల్యే యాదయ్యకు సోయి లేదు బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చటారి దశరథ్ 

చేవెళ్ల :మండల పరిధిలోని ఆలూర్ గేట్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం నేపథ్యంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి సోయిలేకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, బీఆర్ఎస్ పార్టీ పైన చేసిన వాఖ్యలను బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చటారి దశరథ్ తీవ్రంగా ఖండించారు. చేవెళ్లలో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో దశరథ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే యాదయ్యకు అసలు నీకు సోయుందా? తనకు బాధ్యతుందా?, చిత్తశుద్ధుందా? లేదా? అధికారం పోగానే కాంగ్రెస్ లోకి ఏమి ఆశించి పోయారోనని, ఆ విషయం ప్రజలకు చెప్పాల్సిన అవసరముందన్నారు. ఎమ్మెల్యే యాదయ్య లాంటి వలసపక్షి, ఊసరవెల్లి లాంటి నాయకుడు ఇలాంటి మాటలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, స్పీకర్ ప్రయాణించే ప్రధాన రహదారి ఇంత దారుణంగా ఉండడం ఈ ప్రాంత ప్రజల దౌర్భాగ్యమని అన్నారు. బీఆర్ఎస్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి ఏనాడు కూడా ప్రభుత్వంలో రోడ్డు ప్రస్తావన తేలేదన్నారు. పదేళ్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కాలే యాదయ్యనే ఉన్నాడు కదా, అప్పుడు గాడిద పళ్ళు తోమారా? అని విమర్శించారు. ఇప్పుడు మాత్రం తిన్నింటి వాసాలు లెక్కపెట్టినట్టు బీఆర్ఎస్ ను విమర్శించడం సరికాదన్నారు. యాదయ్య కుటుంబంలో రెండు జడ్పీటీసీలు, ఒక్క ఎంపీపీ పదవులనిచ్చింది కూడా బీఆర్ఎస్ పార్టీనే అని మర్చిపోతున్నరన్నారని ఎద్దేవా చేశారు. వేల సంఖ్యలో ప్రమాదాలు, వందల సంఖ్యలో మరణాలు జరుగుతున్న కూడా ఇప్పటి వరకు రోడ్డు విస్తరణ పనుల గురించి అసెంబ్లీలో ఏనాడు మాట్లాడింది లేదన్నారు. పదకొండు సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉంటూ కేవలం తన పైరవీలు, పదవుల కోసమే పనిచేస్తున్నరని అన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో పార్టీని సర్వనాశనం చేసింది ఎమ్మెల్యే యాదయ్యనే అని మండిపడ్డారు. పార్టీ పటిష్టత కోసం పనిచేసిన ఏ ఒక్క కార్యకర్తను గానీ, ఉద్యమకారుని గానీ పట్టించుకున్న పాపనపొలేరని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది గనుకనే మన్నెగూడ నుంచి కొడంగల్ వరకు నూతన రోడ్డు నిర్మాణం జరిగిందన్నారు. గత ఎన్నికల ముందు రోడ్డు విస్తరణలో చెట్లు నరకొద్దని ఎన్జీటీ బాలంత్రపు తేజ అనే వ్యక్తి పిటిషన్ వేసి ఆటంకం కలిగిస్తే, దాన్ని అధిగమించాల్సింది పోయి ఎమ్మెల్యే యాదయ్య గాలి మాటలు మాట్లాడటం సరికాదన్నారు. ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి, సోయి ఉంటే చెట్లు నాటడానికి ప్రత్యామ్నాయ స్థలం కేటాయించి ఎన్జీటీని ఒప్పించాలని అన్నారు. లేని యెడల ప్రభుత్వంలో తీర్మానం చేసి స్వచ్ఛందంగా రండి చెట్లు నరికేద్దామని ఎమ్మెల్యే అనాలి, మహా అయితే తన మీద కేసు అవుతోంది, తనకు ఓట్లేసిన ప్రజల కోసం ఆ మాత్రం భరించలేరా? అని అన్నారు. ఎక్స్ గ్రేషియా, ఆర్థిక సహాయాలు ఇచ్చినంత మాత్రన ప్రాణాలు తిరిగి రావన్నారు. చేయాల్సిన పని గాలికొదిలేసి బీఆర్ఎస్ ను బద్నామ్ చేస్తే ఖబర్దార్ యాదయ్య ఊర్లల్లో తిరగకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు ఆసిఫ్, నరేష్, పృధ్వి, తేజ, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణ – టర్కీ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు  టర్కీ రాయబారి ఫిరాట్‌ సునెల్‌తో మంత్రి దామోదర్‌ భేటీ

TNR NEWS

కులమతాలకు అతీతంగా సెమి క్రిస్మస్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో సెమి క్రిస్మస్

TNR NEWS

పేద వృద్ధులకు దుప్పట్లు పంపిణీ

TNR NEWS

స్కౌట్స్ & గైడ్స్ కు ప్రత్యేక అభినందనలు……. జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి

TNR NEWS

జాన్ పహాడ్ ఉర్సు గంధం ఊరేగింపు ప్రారంభించిన మంత్రి

TNR NEWS

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

TNR NEWS