ఈనెల 25 న బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తొగరు రమేష్ గురువారం ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొద్దుల చెరువు స్టేజి వద్ద గల రేణుక సహస్ర గార్డెన్స్ వెంచర్లో బిఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ ముఖ్య కార్యకర్తలు సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కోదాడ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ హాజరవుతున్నారని అన్నారు. ఈ సమావేశానికి బిఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు సింగిల్ విండో డైరెక్టర్లు గ్రామ శాఖ అధ్యక్షులు కార్యదర్శులు మండల యూత్ నాయకులు గ్రామ యూత్ నాయకులు వివిధ హోదాలో ఉన్న ప్రతి ఒక్కరు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయగలరని కోరారు.