May 24, 2026
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

అధ్వాన్న స్థితిలో దౌల్తాబాద్ పాఠశాల.

స్వచ్ఛభారత్ స్వచ్ఛ తెలంగాణ అంటూ మరుగుదొడ్లు నిర్మించిన పాలకులు ప్రభుత్వ పాఠశాలల వైపు కన్నెత్తి చూడడం లేదు. మూత్రశాల, మరుగుదొడ్ల వసతి లేక బాలికలు పాఠశాలలకు దూరమైపోతున్న దృష్టితీ నెలకొన్నది , దేశ భవిష్యత్తును తిరగరాసి బాలలు అక్షరాలు దిద్దే పాఠశాలలో మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక అవస్థలు పడుతున్న ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్ గ్రామంలో బాలుర ప్రాథమిక పాఠశాల పరిస్థితి ఇది . దౌల్తాబాద్ గ్రామంలో ప్రభుత్వ బాలుర ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కనీస వసతులు లేవు పాఠశాలలోని మరుగుదొడ్లు, మూత్రశాలలు శిథిల వ్యవస్థలో ఉన్నందున పనిచేయక వాటిని వినియోగించడం లేదు, నీటి సదుపాయం కూడా లేదు, కొత్తవి నిర్మించారు, సగంలోనే అసంపూర్తిగా వదిలేశారు. విద్యార్థులు బహిరంగ మూత్ర విసర్జన చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్లకు వెళ్లాల్సి వస్తే సుమారు కిలోమీటర్ ఇంటికి వెళ్లి తిరిగి పాఠశాలకు వచ్చే పరిస్థితి ఉంది. మూత్రశాలలు సరిగ్గా లేక పాఠశాల ఆవరణలో మూత్ర విసర్జన చేయడంతో కీటకాలు ఏర్పడి విద్యార్థులు అనారోగ్య పాలవుతున్నారు. ఇక తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి ఇబ్బందులు లేవు అనే చెప్పుకునే ప్రభుత్వం కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్న దౌల్తాబాద్ పాఠశాలలో విద్యార్థులను పట్టించుకోకపోవడం పై విమర్శలు చెందుతున్నాయి. సంబంధిత అధికారి, ఈ పాఠశా ను పర్యవేక్షించలేదని ఆరోపణలు ఉన్నాయి. గ్రామాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సంబంధిత అధికారులకు విద్యార్థులు పడే అవస్థలు కనిపించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడి ఇబ్బందులు ఎదుర్కొంటున్న తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్నారు. దానితో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగింది. కానీ విద్యార్థులకు కల్పించాల్సిన మౌలిక వసతులు ప్రభుత్వం కల్పించకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు వెంటనే మరుగుదొడ్లు మూత్రశాలలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Related posts

రైతులెవరు ఆందోళన చెందవద్దు యధావిధిగా యూరియా అమ్మకాలు

Harish Hs

ఉపాధి హామీ సోషల్ అడిట్ ఇంటింటి సర్వే పాల్గొని పరిశీలిస్తున్న డి.ఆర్.పి రేచల్

TNR NEWS

తెలంగాణలో మరోబిసి ఉద్యమానికి ప్రజలు సిద్ధం కావాలి

TNR NEWS

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

TNR NEWS

*కార్తీక పూజల్లో పాల్గొన్న మాజీమంత్రి జగదీష్ రెడ్డి దంపతులు..*

Harish Hs

సన్న వడ్లకు బోనస్ పై రైతుల హర్షం కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముస్కుల సురెందర్ రెడ్డి

TNR NEWS