మీడియా స్వేచ్ఛను హరించేలా కొందరు ప్రముఖులు ప్రవర్తిస్తున్నారని, దాడి చేసి సారీ చెబితే సరిపోతుందా అని కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు ప్రశ్నించారు.
శుక్రవారం ఆయన మాట్లాడుతూ…. సినీ ప్రముఖుల వారి కుటుంబ విషయాలను బయట పడేలా… పోలీస్ స్టేషనులకు ఫిర్యాదులు చేసుకున్నప్పుడు, ప్రజలలో పాపులారిటీ ఉన్న వారిపై, తప్పనిసరిగా మీడియా ప్రతినిధులు ఫోకస్ చేస్తారని, ఆ క్రమంలోనే మోహన్ బాబు ఇంట్లో జరిగినటువంటి గొడవలకు సంబంధించి సమాచారాన్ని ప్రజలకు అందజేస్తున్న క్రమంలో టీవీ9 జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబ, ఆయన వ్యక్తిగత సిబ్బందిగాయపరచడంారహితంగా దాడి చేసి గాయపరచడం హేయమైన చర్య అన్నారు. దాడి చేసి సారీ చెప్పి చేతులు దులుపుకుంటే సరిపోతుందా అని ఆయన మండిపడ్డారు. కనీసం ఆసుపత్రికి వెళ్లి జర్నలిస్టులు పరామర్శించలేదని, జర్నలిస్ట్ అంటే మరి అంత చిన్న చూపు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్ గా తీసుకొని తక్షణమే మోహన్ బాబును అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.