మెట్ పల్లి-1 ఎస్ఐ గా కిరణ్ కుమార్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన ఎస్ఐ చిరంజీవి నిజామాబాద్ జిల్లాకు బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో మల్లాపూర్ ఎస్ఐ కిరణ్ కుమార్ బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు తమకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.