Tnrnews.in
తెలంగాణ

పెద్దగట్టు జాతర ప్రాంగణాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

త్వరలో జరగనున్న దురాజుపల్లి పెద్దగట్టు జాతర యొక్క పరిసరాలను జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ పరిశీలించారు.మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోనిజాతర యొక్క పరిసరాలను, దేవాలయ ప్రదేశాన్ని, రోడ్డు మార్గాలను, భక్తులు వేచి ఉండే స్థలాలు వాహనాల పార్కింగ్ ప్రవేశాల స్థితిగతులను ఎస్పీ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం జరిగినదని ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లి జాతరను ప్రశాంతంగా నిర్వహిస్తామని, పెద్దగట్టు జాతర యొక్క పోలీసు బందోబస్తు కావాల్సిన ఏర్పాట్లను పరిశీలించాలని స్థానిక పోలీస్ అధికారులకు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు తెలిపారు. జాతీయ రహదారి వెంట వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఇతర శాఖల అధికారులతో కలిసి సమన్వయంగా పని చేయాలని తెలిపారు. జాతర ప్రాంగణంలో కావాల్సిన రక్షణ ఏర్పాట్లకు సంబంధించి ప్రణాళిక రూపొందించుకోవాలని ఇతర శాఖలతో సమన్వయంతో ముందుకెళ్లాలని సిబ్బందికి సూచించారు. బందోబస్తు ప్రణాళిక పై స్పెషల్ బ్రాంచ్ దృష్టి పెట్టి పని చేయాలని అన్నారు.అనంతరం దైవ దర్శనం చేసుకుని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డియస్పి రవి, సూర్యాపేట రూరల్ సిఐ రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగభూషణం,చివ్వేంల ఎస్సై మహేశ్వర్, సిబ్బంది ఉన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘ ప్రధాన కార్యదర్శిగా విజయలక్ష్మి

TNR NEWS

మునగాల మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్& ఎం.ఎస్.పి. ఆధ్వర్యంలో ఘనంగా 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

Harish Hs

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Harish Hs

పుడ ఏర్పాటు కోసం పెద్దపల్లి పట్టణ బంద్ అసంపూర్ణం.

TNR NEWS

తెలంగాణ చదువుల్లో మార్పులు రావాలి

TNR NEWS

పొగ మంచు కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు

Harish Hs