Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కన్నుల పండుగగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం

సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లిలో వెలిసిన భక్తుల పాలిట కొంగు బంగారం కొరమీసాల కొమురవెల్లి మల్లన్న కల్యాణం అంగరంగ వైభవంగా వరుడు మల్లికార్జున స్వామి తరఫున పడిగన్నగారి వంశస్తులు,వధువులు మేడలాదేవి,కేతమ్మదేవి తరపున మహాదేవుని వంశస్తులు పాల్గొని కల్యాణాన్ని అంగరంగా జరిపించారు.ఆలయ సంప్రదాయం ప్రకారం ఆదివారం ఉదయం 10.45 గంటలకు కొమురవెల్లి క్షేత్రంలోని ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణంలోని తోట బావి వద్ద గల కల్యాణ వేదికలో జగద్గురు మల్లికార్జున విశ్వరాధ్య శివాచార్య స్వామి ఆధ్వర్యంలో వేద ఆగమన శాస్ర ప్రకారం కల్యాణం ఆలయ ప్రధాన అర్చకులు స్వామి వారి కళ్యాణం నిర్వహించారు.ఆలయ సిబ్బంది వేకువజామున 5గంటలకు స్వామి వారికి దిష్టికుంభం(బలిహరణం),10.45 గంటలకు స్వామి కల్యాణం, మధ్యాహ్నం 12గంటలకు ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. మల్లన్న కళ్యాణంతో జాతర బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం అవుతాయి.నేటి నుండి మూడు నెలల పాటు కొనసాగుతాయి.కల్యాణానికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు,తలంబ్రాలు ఆలయ ప్రధాన అర్చకులు సమర్పించారు.ఈ కళ్యాణం లో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి,మాజీ మంత్రి మల్లా రెడ్డి,జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి,జనగామ డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.అలాగే కళ్యాణనికి రాష్ట్ర నలుమూలల నుండి కాకా ఇతర రాష్టాలనుండి భారీగా భక్తులు హాజరయ్యారు.దీంతో ఆలయ ప్రాంగణం పరిసరాలు అంతా ఆధ్యాత్మిక శోభ ను సంతరించుకున్నాయి.భక్తుల సౌకర్యం కోసం కల్యాణ వేదిక తోటబావి ప్రాంతంలో నిర్మించిన శాశ్వత కల్యాణ వేదిక వద్ద బారికేడ్లు,షామియానాలు ఏర్పాట్లు చేశారు.ఎలాంటి అవాంఛనియా ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

Related posts

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం

TNR NEWS

నేడు జాతీయ బాలిక దినోత్సవం

TNR NEWS

ఘనంగాకలకోవగ్రామంలో అయ్యప్పస్వామిపడిపూజ మహోత్సవం

Harish Hs

TG UUEU రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

TNR NEWS

పండ్ల వ్యాపారస్తులు ఐక్యంగా. ఉండాలి

Harish Hs

బానోత్ బిక్షం నాయక్ మరణం తీరని లోటు

Harish Hs