రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని,రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ అన్నారు. సోమవారం మునగాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు.ఆస్పత్రిలోని ఫార్మసీ, ప్రాథమిక పరీక్ష గది, గదులను పరిశీలించారు. అటెండెన్స్ రిజిస్టర్ చెక్ చేసి రిజిస్టర్ లో సంతకం చేసిన ప్రకారం వైద్యులు, సిబ్బంది ఉన్నారా ? లేదా ? అని చూశారు. ఆస్పత్రిలో వైద్యసేవల కోసం వచ్చిన పేషంట్ల తో ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వం వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్యసేవలు అందించాలని అన్నారు. ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా స్టాక్ పూర్తికాక ముందే ఇండెంట్ చేసి మందులను తెప్పించుకోవాలన్నారు.

previous post