కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు, ఎస్సీ వర్గీకరణ చేస్తూ అసెంబ్లీలో ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కోదాడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు. గురువారం కోదాడ పట్టణంలోని రాజీవ్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఫ్లెక్సీలకు బీసీ నాయకులు, దళిత సంఘ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నదని తెలిపారు. గత 30 ఏళ్లుగా వర్గీకరణ కోసం పోరాడుతున్న మాదిగల కలను నెరవేర్చమన్నారు. బీసీలకు గతంలో ఎన్నడూ లేని విధంగా 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో ఆమోదించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ పారా సీతయ్య, ఎర్నెని బాబు, పిసిసి ప్రచార కమిటీ స్టేట్ కోఆర్డినేటర్ కేఎల్ఎన్ ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ, వైస్ చైర్మన్ బషీర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, చింతలపాటి శ్రీనివాసరావు, పాలూరి సత్యనారాయణ, ఆవు దొడ్డి ధన మూర్తి, చింతా బాబు, ఈదుల కృష్ణయ్య, పంది తిరపయ్య మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు……….