సూర్యాపేట జిల్లాకు కామ్రేడ్ ధర్మబిక్షం పేరు పెట్టాలని జిల్లా గౌడ జర్నలిస్టులు ప్రభుత్వాన్ని కోరారు.బొమ్మగాని ధర్మభిక్షం 14వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ.. కల్లుగీత కార్మిక కుటుంబంలో పుట్టి 3 సార్లు ఎమ్మెల్యే గా, 2సార్లు ఎంపీ గా ఈ రాష్ట్రానికి ,దేశానికి కామ్రేడ్ ధర్మ బిక్షం గౌడ్ ఎనలేని సేవలందించాడని,పేద ప్రజల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశాడని జర్నలిస్ట్ లు అన్నారు..1996 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 480 మంది ఫ్లోరైడ్ బాధితులు ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసిన కూడా 70000 ఓట్ల మెజార్టీ తో గెలుపొందిన ఘనత ధర్మబిక్షం దే నని జర్నలిస్టులు ఈ సందర్భంగా గుర్తు చేశారు.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలకంగా పనిచేసి నిజాం నిరంకుశ పాలన నుంచి ఈ రాష్ట్రానికి విముక్తి కలిగించడంలో ప్రముఖ పాత్ర వహించారని అన్నారు. .ప్రాజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి ధర్మబిక్షం అని, కల్లు గీత కార్మికుల సంక్షేమం కోసం గీత పనివారల సంఘం ఏర్పాటు చేసి వారి హక్కుల కోసం పోరాటం చేయడమే కాకుండా, పలు కార్మిక సంఘాలు నెలకొల్పి కార్మికుల పక్షపాతిగా పేరిందారని అన్నారు. బొమ్మ గాని ధర్మ బిక్షం చేసిన సేవలకు గుర్తుగా సూర్యాపేట జిల్లాకు కామ్రేడ్ బొమ్మగాని ధర్మ బిక్షం పేరు పెట్టాలని గౌడ జర్నలిస్టుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ఐత బోయిన రాంబాబు గౌడ్,రాపర్తి మహేష్ గౌడ్ ,గుణగంటి సురేష్ గౌడ్, సిగ సురేష్ గౌడ్ ,లింగాల సాయి గౌడ్,తండు నాగేందర్ గౌడ్, బూరా శ్రీనివాస్ గౌడ్,పులుసు నాగరాజు గౌడ్,గుడిపూరి రామకృష్ణ ,ఎరుకల సైదులు గౌడ్, తందారపల్లి శ్రీనివాస్ గౌడ్, పుట్ట రాంబాబు గౌడ్,
రాగిరి మల్లేష్ గౌడ్, జలగం మధు,ఉయ్యాల నరసయ్య గౌడ్, దోసపాటి అజయ్ గౌడ్, తండూ వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.